
సినిమాలు

దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించారు. ఢిల్లీలో పెల్లెట్ గన్స్, బిహార్‌లో AK-47 ఘటనలను ప్రస్తావిస్తూ విద్యార్థులపై మోదీ ప్రభుత్వం కక్షగట్టిందని ఆరోపించారు. విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
జూలై 25న బిహార్‌లోని సివాన్‌లో జరిగిన విద్యార్థుల ధర్నా సందర్భంగా ఒక పోలీసు అధికారి AK-47తో కనిపించిన వీడియో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటనపై స్పందించిన బిహార్ ప్రభుత్వం సంబంధిత పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేసింది. ఈ పరిణామం దేశవ్యాప్తంగా విద్యార్థుల నిరసనల నిర్వహణ, పోలీసుల చర్యలపై రాజకీయ చర్చకు దారితీసింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!