

రాజమండ్రిలో మెడికో ప్రియాంక, ఆమె స్నేహితుడు ఉమేష్‌పై జరిగిన దాడి సాధారణ రోడ్డు ప్రమాదం కాదని, క్రిమినల్ చర్యగా పరిగణిస్తున్నామని ఎస్పీ నరసింహ కిశోర్ తెలిపారు. సినిమా ఫస్ట్ షో చూసి స్కూటీపై తిరిగి వస్తున్న సమయంలో మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు మాల్ సెక్యూరిటీ సిబ్బందితో గొడవపడ్డారని పోలీసులు తెలిపారు. అనంతరం కారులో అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నిస్తూ ప్రియాంక, ఉమేష్ ప్రయాణిస్తున్న స్కూటీని ఢీకొట్టారని, ఆ తర్వాత కూడా కారును వారిపై నుంచి రెండుసార్లు పోనిచ్చి పరారైనట్లు చెప్పారు. ఈ ఘటన మొత్తం మాల్ సీసీటీవీ కెమెరాల్లో నమోదైనట్లు తెలిపారు.
ఘటన జరిగిన రాత్రే ఆసుపత్రి నుంచి సమాచారం అందుకున్న పోలీసులు, ఉమేష్ వాంగ్మూలం మరియు సీసీటీవీ ఆధారాలతో గంటల వ్యవధిలోనే నిందితులను అదుపులోకి తీసుకున్నారు. న్యాయ సలహాతో సెక్షన్ 307 కింద కేసు నమోదు చేసి, ఈ నెల 6న కోర్టులో హాజరుపరచగా నిందితులకు రిమాండ్ విధించినట్లు తెలిపారు. బాధితులు, నిందితుల మధ్య గతంలో ఎలాంటి పరిచయం లేదా శత్రుత్వం లేదని కాల్ డేటా రికార్డుల విశ్లేషణలో తేలిందన్నారు. కేసును మరింత బలోపేతం చేసేందుకు పోలీస్ కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేయడంతో పాటు, డాక్యుమెంటరీ మరియు డ్రైవింగ్‌కు సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నామని ఎస్పీ వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!