
జనరల్

సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రజలకు ఊరట కల్పించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలకంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. పండుగ రోజుల్లో హైవేలపై భారీగా పెరిగే ట్రాఫిక్, టోల్ ప్లాజాల వద్ద గంటల తరబడి జాములు ఏర్పడకుండా ఉండేందుకు టోల్ ఛార్జీలను ప్రభుత్వమే భరించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదన అమలుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరమని అధికారులు భావిస్తున్నారు.
కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్నగర్, వరంగల్, విజయవాడ మార్గాల్లో ప్రయాణించే వాహనదారులకు ఈ నిర్ణయం లాభం చేకూరనుంది. టోల్ ఫ్రీ అమలైతే పండుగ సమయంలో ప్రయాణం మరింత సులభమవుతుందని, ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుతాయని అంచనా. ఈ అంశంపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!