

డిజిటల్ అరెస్టులపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. డిజిటల్ అరెస్టులు, సైబర్ నేరాల విషయంలో సోషల్ మీడియా సంస్థలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లు, సైబర్ నేరాల అడ్డుకట్టకు ప్రతిపాదిత చర్యలపై నివేదిక ఇవ్వాలని వాట్సాప్, ఇతర సోషల్ మీడియా సంస్థలను సుప్రీంకోర్టు ఆదేశించింది. తమ వద్ద ఉన్న సాంకేతిక నివారణ చర్యల వివరాలను ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్‌కి కూడా సమర్పించాలని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం స్పష్టం చేసింది. బ్యాంకుల నిర్లక్ష్యం వల్ల ఖాతాదారులు సైబర్ ఫ్రాడ్‌లో డబ్బు పోగొట్టుకుంటే, ఆ నష్టాన్ని సదరు బ్యాంకులే భరించేలా ఆర్‌బీఐ నిబంధనలు తేవాలని ధర్మాసనం తేల్చిచెప్పింది.
డిజిటల్ అరెస్ట్ మోసాలపై సుమోటోగా కేసు విచారణ జరిపింది. డిజిటల్ అరెస్టులు, సైబర్ నేరాల కట్టడికి వాట్సాప్‌తో పాటు బ్యాంకులు, పోలీసు విభాగానికి కఠిన సూచనలు చేసింది. ఖాతాదారుల సాధారణ పరిమితికి భిన్నంగా పెద్దమొత్తంలో డబ్బు బదిలీ అవుతుంటే బ్యాంకులు ఎందుకు ఆపడం లేదని ప్రశ్నించింది. సైబర్ మోసాలపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లు, దర్యాప్తు పురోగతి నివేదికలను సమర్పించాలని రాష్ట్రాల డీజీపీలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆర్‌బీఐ కొత్త కేవైసీ మార్గదర్శకాలను స్వయంగా పరిశీలిస్తామని బెంచ్ వెల్లడించింది. తదుపరి విచారణ నవంబర్ 23కి వాయిదా వేసింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!