

గోవాలో భూములు అన్యాక్రాంతమవుతున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. భాజపా పాలనపై గోవా ప్రజలు విసిగిపోయారని వ్యాఖ్యానించారు. గోవా సీఎం ప్రమోద్ సావంత్‌ను ఉద్దేశించి ‘సీఎం కాదు.. ప్రాపర్టీ సావంత్’ అని విమర్శించారు. గోవా పర్యటనలో భాగంగా ‘గోయ్ రాఖోన్న్’ యాత్రలో పాల్గొన్న రేవంత్‌రెడ్డి.. దిల్లీలో నిరసనల కారణంగా రాహుల్ గాంధీ ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారని, ఆయన ప్రతినిధిగా తాను ఇక్కడికి వచ్చానని తెలిపారు.
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ పేరుతో పేదల ఓట్లను తొలగిస్తున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. పేదలు, దళితులు, మైనారిటీలు, ఆదివాసీల ఓట్లను తొలగిస్తున్నారని విమర్శించారు. గోవా యువతను డ్రగ్స్‌కు బానిసలుగా మార్చారని, రాష్ట్రాన్ని డ్రగ్స్ పెడ్లర్లకు కేంద్రంగా మార్చారని ఆరోపించారు. గతంలో రెండుసార్లు మోసపోయిన గోవా ప్రజలు, మూడోసారి భాజపాను నమ్మి మోసపోవద్దని అన్నారు. గోవాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!