
జనరల్

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇటీవల కన్నుమూసిన తన తల్లి సావిత్రీ దేవి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ భావోద్వేగ లేఖ రాశారు. ‘యోగి కీ పాటీ’ పేరుతో రాసిన ఈ లేఖలో తన సన్యాస జీవితానికి సంబంధించిన పలు వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు. సన్యాసం స్వీకరించిన మూడేళ్ల తర్వాత తొలిసారి స్వగ్రామానికి వెళ్లిన సందర్భాన్ని ప్రత్యేకంగా గుర్తుచేసుకున్నారు.
ఆ సమయంలో కాషాయ వస్త్రాలు ధరించి ఇంటి ముందు నిలబడి తన తల్లిని భిక్ష అడిగినట్లు యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. తనను సన్యాసం ఎందుకు స్వీకరించావని తల్లి ప్రశ్నించిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. అయితే తన నిర్ణయం వెనుక ఉన్న ఆధ్యాత్మిక భావనను అర్థం చేసుకున్న తల్లి చివరకు దానిని గౌరవించిందని తెలిపారు. తల్లితో తనకున్న అనుబంధం, సన్యాస జీవితంలో ఎదురైన భావోద్వేగ అనుభవాలను ఈ లేఖలో ఆయన పంచుకున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!