
జనరల్

తెలంగాణ వ్యాప్తంగా 35 ఇసుక క్వారీల్లో లోడింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 18 ఇసుక క్వారీల్లో కూడా కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయినట్లు సమాచారం. డీజిల్ ధరలు భారీగా పెరగడంతో కార్యకలాపాలు కొనసాగించడం కష్టమవుతోందని కాంట్రాక్టర్లు పేర్కొంటున్నారు.
అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న రూ.300 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని కాంట్రాక్టర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు లోడింగ్ నిలిపివేస్తామని వారు స్పష్టం చేశారు. ఈ పరిణామం రాష్ట్రంలోని ఇసుక సరఫరాపై ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!