
జనరల్

యెమెన్‌లో హూతీ స్థావరాలపై సౌదీ నేతృత్వంలోని కూటమి భారీ సైనిక చర్య చేపట్టింది. సాదా, అల్ హుదైదా, అల్ జౌఫ్, మారిబ్ ప్రావిన్సుల్లో మొత్తం 82 హూతీ సైనిక లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు కూటమి ప్రకటించింది. బాలిస్టిక్ క్షిపణుల నిల్వ కేంద్రాలు, కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, ఆయుధ గిడ్డంగులు తదితర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది.
సౌదీ అరేబియాలోని రియాద్, అబ్హా విమానాశ్రయాలపై హూతీలు ఇటీవల జరిపిన దాడులకు ప్రతిస్పందనగా ఈ చర్య చేపట్టినట్లు కూటమి వెల్లడించింది. పౌరులు, పౌర మౌలిక సదుపాయాలపై జరిగే దాడులను ఉపేక్షించబోమని కూటమి అధికార ప్రతినిధి మేజర్ జనరల్ తుర్కీ అల్ మాలికీ హెచ్చరించారు. తాజా దాడులతో యెమెన్‌లో కొనసాగుతున్న ఘర్షణలు మరింత తీవ్రరూపం దాల్చాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!