
జనరల్

కాక్‌రొచ్ జనతా పార్టీ (CJP) సహ కన్వీనర్ సౌరవ్ దాస్ చేసిన ఓ వ్యంగ్య సోషల్ మీడియా పోస్ట్ ఆన్‌లైన్‌లో చర్చకు దారితీసింది. తన నెలవారీ ఇంటి అద్దె రూ.12 లక్షల నుంచి రూ.24 లక్షలకు పెరగబోతోందంటూ ఆయన పేర్కొన్నారు. అక్టోబర్ 24న ఎక్స్ (X) వేదికగా ఈ వ్యాఖ్యను పోస్ట్ చేసిన దాస్.. తన సందేశానికి ఏడుస్తున్న, నవ్వుతున్న ఎమోజీలను జత చేశారు.
ఈ పోస్ట్‌కు భారీ స్పందన లభించిందని, ఇప్పటివరకు సుమారు 34 లక్షల వ్యూస్ వచ్చాయని సమాచారం. దాస్ చేసిన వ్యంగ్య వ్యాఖ్య నెటిజన్ల దృష్టిని ఆకర్షించినప్పటికీ, అద్దె పెంపునకు సంబంధించిన మరిన్ని వివరాలను ఆయన వెల్లడించలేదు. ఈ వ్యాఖ్యను వాస్తవ అద్దె పెంపు ప్రకటనగా కాకుండా, వ్యంగ్యపూరిత పోస్ట్‌గా పేర్కొనడం గమనార్హం.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!