

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ)లో సుమారు 2 వేల మంది కండక్టర్ల కొరత కారణంగా రాష్ట్రవ్యాప్తంగా బస్సు సర్వీసులు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. దాదాపు 300 రెగ్యులర్ రూట్లలో సర్వీసులు అంతరాయం ఎదుర్కొంటుండగా, కండక్టర్లు లేక కొన్ని బస్సులు డిపోలకే పరిమితమవుతున్నాయి. దీంతో సుమారు 650 గ్రామాలు, అనుబంధ పల్లెలకు రవాణా సౌకర్యాలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా గిరిజన, మారుమూల ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం.
నిజామాబాద్–ఆర్మూర్–కరీంనగర్ వంటి కీలక మార్గాలపై కూడా ఈ కొరత ప్రభావం చూపుతోంది. దీంతో ప్రయాణికులు ఆటోలు, జీపులు వంటి ప్రత్యామ్నాయ రవాణా సౌకర్యాలను ఆశ్రయించాల్సి వస్తోంది. సంస్థ అవుట్‌సోర్సింగ్ విధానంలో సిబ్బందిని నియమిస్తున్నప్పటికీ, అది అవసరాలకు సరిపోవడం లేదని తెలుస్తోంది. జీతాల భారం కారణంగా కొత్త రెగ్యులర్ నియామకాలపై సంస్థ ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదనే చర్చ కొనసాగుతోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!