
గాసిప్స్

అఫ్గానిస్థాన్‌లో ఒంటరిగా పర్యటించిన ఒక భారతీయ మహిళకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తల్లిదండ్రులకు చెప్పకుండా అక్కడికి వెళ్లినట్లు ఆమె వెల్లడించారు. తాను క్షేమంగానే ఉన్నానని చెప్పిన ఆమె, అక్కడి పరిస్థితులు ఊహించిన దానికంటే భిన్నంగా ఉండి తనను తీవ్ర భావోద్వేగాలకు గురి చేశాయని తెలిపారు.
పర్యటనలో భాగంగా ఆమె అక్కడి మహిళలను కలుసుకున్నారు. ఆయుధాలతో వీధుల్లో సంచరించే వ్యక్తులను చూసి ఆశ్చర్యపోయారు. మరోవైపు అక్కడి ప్రజల ఆతిథ్యం, ఆప్యాయత, స్నేహశీలత తనను ఆకట్టుకున్నాయని చెప్పారు. అయితే మహిళలు ఎదుర్కొంటున్న అణచివేతను చూసి కలత చెందానని పేర్కొన్నారు. ప్రజల సహృదయత, కష్టసుఖాల మధ్య ఉన్న వైరుధ్యాలు తనపై గాఢమైన ముద్ర వేశాయని ఆమె తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!