

వచ్చే నెల 7, 8, 9 తేదీల్లో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు వెల్లడించారు. ఈ గ్లోబల్ సమ్మిట్ కోసం నాలుగు భాషల్లో ప్రత్యేక గీతాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి ఆధ్వర్యంలో ఈ సమ్మిట్ ఆంథమ్‌ను సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి, ప్రత్యేకతలు, పెట్టుబడుల అవకాశాలను ప్రతిబింబించేలా ఈ గీతాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం.
సమ్మిట్ ప్రారంభోత్సవంతో పాటు క్లైమేట్ కాన్సర్ట్‌లో భారీ స్థాయిలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సంజయ్ జాజు తెలిపారు. రాష్ట్ర కళలు, సంస్కృతి, సంప్రదాయాలను దేశ, విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులకు పరిచయం చేసేలా ప్రత్యేక కార్యక్రమాలను రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. గ్లోబల్ సమ్మిట్‌ను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!