
జనరల్

అమెరికాలోని ఓ షాపింగ్ మాల్‌లో భారత సంతతి వ్యక్తిపై జరిగిన కత్తి దాడి కలకలం రేపింది. బాధితుడి మతం గురించి ప్రశ్నించిన అనంతరం ఎలాంటి ప్రేరణ లేకుండానే నిందితుడు కత్తితో పలుమార్లు దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన మత విద్వేషంతో జరిగిన దాడిగా అనుమానిస్తున్నారు.
తీవ్ర గాయాలపాలైన బాధితుడిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన స్థలంలోనే నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. హేట్ క్రైమ్ కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుండగా, ఈ ఘటన అమెరికాలో పెరుగుతున్న విద్వేషపూరిత దాడులపై మరోసారి ఆందోళన వ్యక్తం చేస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!