
సినిమాలు

ఈ20 పెట్రోల్‌కు సంబంధించిన అంశంపై సుప్రీంకోర్టులో కీలక విచారణ జరిగింది. ఈ సందర్భంగా పాత వాహనాల ఇంజిన్లపై ఈ20 పెట్రోల్ ప్రభావం, మైలేజ్ తగ్గుదల, కాలుష్యం పెరుగుదల వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వం తన వివరణను సమర్పించింది. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఆరోపణలకు ఇప్పటివరకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లభించలేదని కేంద్రం స్పష్టం చేసింది.
ఇథనాల్ మిశ్రమ ఇంధన వినియోగం వల్ల ముడి చమురు దిగుమతులు తగ్గడంతో పాటు విదేశీ మారకద్రవ్య ఆదా, రైతులకు అదనపు ఆదాయం, కార్బన్ ఉద్గారాల తగ్గింపు వంటి పలు ప్రయోజనాలు లభిస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటికే ఈ విధానం ద్వారా దేశం రూ.1.4 లక్షల కోట్లకు పైగా విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేసినట్లు వెల్లడించింది. ఈ అంశంపై తుది నిర్ణయం సుప్రీంకోర్టు విచారణ అనంతరం వెలువడనుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!