

సోహ్రాబుద్దీన్ షేక్ ఎన్‌కౌంటర్ కేసులో 22 మంది నిందితుల నిర్దోషిత్వాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణకు అంగీకరించింది. సీబీఐతో పాటు 22 మంది నిర్దోషులుగా విడుదలైన వారికి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో 21 మంది గుజరాత్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పోలీసు అధికారులు ఉన్నారు. 2026 మే 7న బాంబే హైకోర్టు 2018లో ప్రత్యేక సీబీఐ కోర్టు ఇచ్చిన నిర్దోషిత్వ తీర్పును సమర్థించింది. దాన్ని సవాల్ చేస్తూ సోహ్రాబుద్దీన్ సోదరుడు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారిస్తోంది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చీ, జస్టిస్ వి.మోహనలతో కూడిన ధర్మాసనం.. కేసులోని కీలక సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించనున్నట్లు తెలిపింది. విచారణ సమయంలో 210 మంది ప్రాసిక్యూషన్ సాక్షుల్లో 92 మంది మాట మార్చిన అంశం ఆందోళన కలిగించే విషయమని జస్టిస్ బాగ్చీ పేర్కొన్నారు. విచారణ నిష్పాక్షికంగా, న్యాయబద్ధంగా జరిగిందా అనే అంశాన్ని పరిశీలించాల్సి ఉందని ధర్మాసనం తెలిపింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!