

అండర్-19 ఆసియా కప్ 2026 ఫైనల్లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ యువ బ్యాటర్ ఉస్మాన్ ఖాన్ అద్భుతంగా ఆడాడు. 106 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న అతడు.. 11 ఫోర్లు, 2 సిక్సర్లతో మొత్తం 111 బంతుల్లో 107 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో సంయమనంతో ఆడిన ఉస్మాన్ 46 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. ఆ తర్వాత దూకుడు పెంచి భారత బౌలర్లు యశ్‌వర్ధన్ చౌహాన్, అర్జున్ రాజ్‌పుత్ బౌలింగ్‌లో బౌండరీలు, సిక్సర్లు బాదాడు. మరోవైపు అబ్దుల్ ఖాదిర్ 54 బంతుల్లో 80 పరుగులు చేయడంతో వీరిద్దరూ రెండో వికెట్‌కు 135 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో పాకిస్థాన్ స్కోరు 200 పరుగులు దాటింది.
ఫైనల్‌కు ముందు ఈ టోర్నీలో నాలుగు మ్యాచ్‌లు ఆడిన ఉస్మాన్ ఖాన్ 238 పరుగులు సాధించి పాకిస్థాన్ జట్టులో కీలక బ్యాటర్‌గా నిలిచాడు. సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌పై పాకిస్థాన్ తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. 2025 డిసెంబర్‌లో భారత్‌తో జరిగిన గత ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్ 191 పరుగుల తేడాతో గెలిచినా, ఉస్మాన్ మాత్రం 35 పరుగులకే పరిమితమయ్యాడు. తాజా ఫైనల్లో సెంచరీతో ఆ నిరాశను అధిగమించాడు. 2008 మార్చి 20న జన్మించిన ఉస్మాన్ ఎడమచేతి వాటం బ్యాటర్. లెగ్ బ్రేక్, గూగ్లీ బంతులు కూడా వేయగలడు. 2024-25 సీజన్‌లో యూత్ వన్డేల్లో అరంగేట్రం చేసిన అతడు ఆఫ్ఘనిస్తాన్ అండర్-19 జట్టుపై 133 బంతుల్లో 102 పరుగులు చేసి తొలి సెంచరీ సాధించాడు. 2026 అండర్-19 ప్రపంచకప్‌లో స్కాట్లాండ్‌పై 75 పరుగులు చేయగా, అదే ఏడాది సెప్టెంబర్‌లో ఇంగ్లాండ్ అండర్-19 జట్టుపై మరో సెంచరీ సాధించి కెప్టెన్ ఫర్హాన్ యూసుఫ్‌తో కలిసి రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!