
జనరల్

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఉన్న పింటో పార్క్ పారిశ్రామిక ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. అక్కడి శివ్ కంప్రెస్డ్ ఎయిర్ ప్రొడక్ట్స్ ఫ్యాక్టరీలో ఉన్న ఆక్సిజన్ ట్యాంకర్ ఒక్కసారిగా పేలిపోయింది. పేలుడు ధాటికి సమీపంలోని పలు ఇళ్లు, పారిశ్రామిక యూనిట్లు దెబ్బతిన్నాయి. ఇళ్ల గోడలకు పగుళ్లు ఏర్పడటంతో పాటు కిటికీ అద్దాలు పగిలిపోయాయి.
ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని సమాచారం. ఘటన జరిగిన సమయంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ జిల్లా పర్యటనలో ఉన్నారు. పేలుడుకు గల కారణాలు, పరిస్థితులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!