
జనరల్

భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసేందుకు విదేశీయులకు తెలంగాణ ప్రభుత్వం వేదిక కల్పించిందని ఆరోపిస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై శుక్రవారం విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ కార్యక్రమంలో ఓ ఇటలీకి చెందిన వ్యక్తి “ఓట్ చోర్.. గద్దీ ఛోడ్” (ఓట్ల దొంగ.. పదవి నుంచి దిగిపో) అంటూ నినాదం చేయడంపై కూడా పిటిషన్లో అభ్యంతరం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో అభ్యంతరకరంగా ఉన్న భాగానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికల నుంచి తొలగించాలని పిటిషనర్ కోరారు. విదేశీయులు భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసేందుకు అవకాశం కల్పించడంపై పిటిషన్లో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సుప్రీంకోర్టులో ఈ పిల్ విచారణకు వచ్చే అవకాశం ఉంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!