

2026 ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు స్వర్ణ పతకం అందించడంలో కీలక పాత్ర పోషించిన టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ రూ.75 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. తమిళనాడుకు చెందిన సుందర్.. పాకిస్థాన్‌తో జరిగిన పురుషుల క్రికెట్ ఫైనల్లో కీలక బౌలింగ్ ప్రదర్శనతో జట్టు విజయంలో భాగమయ్యాడు. భారత్ 19 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 211 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 61 పరుగులు చేయగా, తిలక్ వర్మ 51 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 192 పరుగులకే పరిమితమైంది. హసన్ నవాజ్ 96 పరుగులతో పోరాడినా పాక్‌కు విజయం దక్కలేదు. భారత బౌలింగ్‌లో వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు తీసి కీలక సహకారం అందించాడు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!