

కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి 2,545 మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలు చేసేందుకు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్‌సీ) ఆమోదం తెలిపింది. ఈ మేరకు అక్టోబరు 30, శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్టీపీసీ నుంచి 1,045 మెగావాట్లు, ఎన్‌హెచ్‌పీసీ నుంచి 500 మెగావాట్లు, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకి) నుంచి 1,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు అనుమతించింది.
ఎన్టీపీసీ, ఎన్‌హెచ్‌పీసీల నుంచి యూనిట్‌కు రూ.2.45 చొప్పున విద్యుత్ కొనుగోలు చేయనున్నారు. సెకి నుంచి 700 మెగావాట్లను యూనిట్‌కు రూ.2.37 చొప్పున, మరో 300 మెగావాట్లను రూ.2.38 చొప్పున కొనుగోలు చేయడానికి ఆమోదం లభించింది. మొత్తం 2,545 మెగావాట్లలో 1,745 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సౌర విద్యుత్ ప్లాంట్లు ఇప్పటికే సిద్ధమయ్యాయి. మిగిలిన 800 మెగావాట్ల ప్లాంట్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ప్లాంట్ల నిర్మాణంలో జాప్యం, జీఎస్టీ పెంపు కారణంగా టారిఫ్‌ల సవరణ, అంతర్రాష్ట్ర విద్యుత్ ప్రసార ఛార్జీలు, మధ్యవర్తి సంస్థలకు చెల్లించే ట్రేడింగ్ మార్జిన్ వంటి అంశాలపై కూడా నియంత్రణ మండలి కీలక విషయాలను ప్రస్తావించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!