

మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యాతగా నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానున్న ‘మెగావర్స్’ టాక్ షోపై సోషల్ మీడియాలో ఆసక్తి పెరుగుతోంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన కమల్ హాసన్ ఎపిసోడ్ పూర్తయిందని, పవన్ కల్యాణ్, రామ్ చరణ్ వంటి క్రేజీ కాంబినేషన్లు కూడా ఉండవచ్చని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఈ టాక్ షో కంటే ప్రస్తుతం అభిమానుల దృష్టి చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’, ‘కాకా’ సినిమాల విడుదల తేదీలపైనే ఉంది.
సంక్రాంతి సందర్భంగా ఈ రెండు చిత్రాల్లో ఏది ముందుగా ప్రేక్షకుల ముందుకు వస్తుందనే విషయంపై స్పష్టత కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఒకే హీరో నటించిన రెండు సినిమాలు స్వల్ప వ్యవధిలో విడుదలైతే వసూళ్లతో పాటు ప్రమోషన్ల విషయంలోనూ నిర్మాతలకు సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే చిరంజీవి విడుదల క్రమంపై త్వరగా నిర్ణయం తీసుకుంటే, రెండు చిత్రాల ప్రచార కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహించేందుకు వీలుంటుంది. మెగాస్టార్ నుంచి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!