

గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్నాయన్న భూ అక్రమాలు, అవకతవకలపై తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమైంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భూములకు సంబంధించిన వ్యవహారాలపై శాసనసభలో జరిగిన చర్చల నేపథ్యంలో ఈ అంశాలను సమగ్రంగా పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంబంధిత భూములు, రికార్డులు, లావాదేవీలకు సంబంధించిన వివరాలను పరిశీలించి, విచారణలో వెలువడే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనుంది.
విచారణకు అవసరమైన రికార్డులు, పత్రాలు, ఇతర సమాచారాన్ని ప్రభుత్వ శాఖలు, అధికారులు, జిల్లా యంత్రాంగాల నుంచి సేకరించేలా కమిటీకి అధికారాలు కల్పించినట్లు సమాచారం. అధికారులు కమిటీకి పూర్తి సహకారం అందించి అవసరమైన సమాచారాన్ని వెంటనే సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని, అవసరమైతే మధ్యంతర నివేదికలను కూడా సమర్పించవచ్చని పేర్కొంది. ఇదిలా ఉండగా, సెక్షన్ 22-ఏ కింద నిషేధిత జాబితాలో ఉన్న భూములకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక ఉన్నతస్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసింది.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!