
జనరల్

తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్, మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మి తన సోదరి కె. నమ్రత (57) కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో నివసించే నమ్రత ఈ నెల 4వ తేదీన ఉదయం 10 గంటల సమయంలో ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఘటనకు సంబంధించి సతీష్ (35), సత్యనారాయణ (45), కుమారి (45) అనే ముగ్గురు వ్యక్తులపై అనుమానం ఉన్నట్లు గద్వాల విజయలక్ష్మి ఫిర్యాదులో వెల్లడించారు. ఫిర్యాదు ఆధారంగా బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నమ్రత ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!