
జనరల్

ఒమన్ తీరంలో భారత్‌కు చెందిన ‘ఎంఎస్‌వీ అల్ జుసుఫీ’ నౌకపై దాడి జరిగింది. ఈ ఘటనలో ఓ భారతీయ నావికుడు ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో నౌకలో మొత్తం 14 మంది భారతీయ నావికులు ఉన్నట్లు తెలిపారు. వీరిలో 13 మందిని ఒమన్ కోస్ట్ గార్డ్ బృందాలు సురక్షితంగా రక్షించాయి. మృతుడిని గుజరాత్‌కు చెందిన గంధర్ నహీం అజీజ్‌గా గుర్తించారు.
రక్షించిన నావికులకు అవసరమైన సహాయం అందించేందుకు ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతోందని మంత్రి తెలిపారు. ప్రాణాలతో బయటపడిన 13 మంది సిబ్బందిని, మృతి చెందిన నావికుడి మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారత్‌కు తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!