3, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

డిస్నీలో భారీగా ఉద్యోగాల కోత..

Writer: Chandrika 11:52 AM, 3 నవంబర్, 2026
డిస్నీలో భారీగా ఉద్యోగాల కోత..

వినోద రంగంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన దిగ్గజ సంస్థ వాల్ట్ డిస్నీ భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమవుతున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. సంస్థ నిర్వహణ వ్యయాలను దాదాపు 20 శాతం తగ్గించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు కీలక మేనేజర్లకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఖర్చుల నియంత్రణలో భాగంగా వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించడంతోపాటు వివిధ విభాగాల్లో వ్యయాలను తగ్గించే చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా థీమ్ పార్కులు, టెలివిజన్ నెట్‌వర్క్‌లు, సినిమా నిర్మాణ విభాగాలపై ఈ ప్రభావం అధికంగా ఉండవచ్చని అంచనా. ఈ చర్యల ద్వారా ఆదా చేసిన నిధులను సినిమాలు, టెలివిజన్ కార్యక్రమాలు, సాంకేతికత, థీమ్ పార్కులు, క్రూయిజ్ షిప్ వ్యాపారాల్లో తిరిగి పెట్టుబడిగా పెట్టాలని సంస్థ సీఈవో జోష్ డి'అమారో లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.

మరోవైపు ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ రంగానికి చెందిన సూసే (SUSE) సంస్థ కూడా ఉద్యోగుల తొలగింపునకు శ్రీకారం చుట్టింది. సంస్థలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 10 శాతం మందిని తొలగించినట్లు సమాచారం. ఈ మేరకు కంపెనీ సీఈవో డిర్క్ పీటర్ వాన్ లీవెన్ ఉద్యోగులకు అంతర్గత మెమో పంపించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఆటోమేషన్ కారణంగా సాఫ్ట్‌వేర్ కంపెనీల పని విధానాల్లో గణనీయమైన మార్పులు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. వ్యాపార కార్యకలాపాలను మరింత సమర్థంగా నిర్వహించడంతోపాటు మారుతున్న సాంకేతిక పరిస్థితులకు అనుగుణంగా సంస్థను తీర్చిదిద్దేందుకు ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సేవా రంగంలో జీఆర్‌టీ జువెలర్స్‌ మరో ముందడుగు

సేవా రంగంలో జీఆర్‌టీ జువెలర్స్‌ మరో ముందడుగు

జోయ్ అలుక్కాస్ జన్మదిన వేడుకల్లో సేవా సందేశం

జోయ్ అలుక్కాస్ జన్మదిన వేడుకల్లో సేవా సందేశం

తెలంగాణలో కొత్త ప్లాంట్‌కు అమర రాజా గ్రీన్ సిగ్నల్‌

తెలంగాణలో కొత్త ప్లాంట్‌కు అమర రాజా గ్రీన్ సిగ్నల్‌

బంగారం ధరలో స్వల్ప మార్పు..వెండి స్థిరం

బంగారం ధరలో స్వల్ప మార్పు..వెండి స్థిరం

దేశీయ బొగ్గు ఉత్పత్తిలో 42 శాతం వృద్ధి

దేశీయ బొగ్గు ఉత్పత్తిలో 42 శాతం వృద్ధి

ట్యాగ్లు
వాల్ట్ డిస్నీడిస్నీ ఉద్యోగాల కోతడిస్నీ లేఆఫ్స్జోష్ డి అమారోఉద్యోగుల తొలగింపుసూసే లేఆఫ్స్సాఫ్ట్‌వేర్ కంపెనీలుఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ఆటోమేషన్టెక్నాలజీ రంగం
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
సెన్సెక్స్‌ పరుగులతో స్టాక్ మార్కెట్‌లో సందడి

సెన్సెక్స్‌ పరుగులతో స్టాక్ మార్కెట్‌లో సందడి

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారత ఆర్థిక వృద్ధిపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన
బిజినెస్

భారత ఆర్థిక వృద్ధిపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన

సీఎం చంద్రబాబుకు అమిత్‌షా ఫోన్‌..
జనరల్

సీఎం చంద్రబాబుకు అమిత్‌షా ఫోన్‌..

ఏపీ మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌.. అత్యధిక స్థానాల్లో కూటమి ఆధిక్యం
రాజకీయాలు

ఏపీ మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌.. అత్యధిక స్థానాల్లో కూటమి ఆధిక్యం

గ్రామ పంచాయతీల్లో ఈవీ చార్జింగ్ కేంద్రాలు.. కేంద్రం కీలక నిర్ణయం
జనరల్

గ్రామ పంచాయతీల్లో ఈవీ చార్జింగ్ కేంద్రాలు.. కేంద్రం కీలక నిర్ణయం

దీపావళి వేళ పెరుగుతున్న బంగారం ధరలు
బిజినెస్

దీపావళి వేళ పెరుగుతున్న బంగారం ధరలు

గోపిక ఆరోగ్యంపై మణిపాల్‌ ఆస్పత్రి హెల్త్‌ బులెటిన్‌
జనరల్

గోపిక ఆరోగ్యంపై మణిపాల్‌ ఆస్పత్రి హెల్త్‌ బులెటిన్‌

ఐడీబీఐ బ్యాంకు ఉద్యోగుల సమ్మె.. ఖాతాదారులకు కీలక సూచనలు
జనరల్

ఐడీబీఐ బ్యాంకు ఉద్యోగుల సమ్మె.. ఖాతాదారులకు కీలక సూచనలు

మళ్లీ ఫామ్‌లోకి యశస్వి.. కివీస్‌-ఎ బౌలర్లపై విరుచుకుపడ్డ యువ ఓపెనర్
క్రీడలు

మళ్లీ ఫామ్‌లోకి యశస్వి.. కివీస్‌-ఎ బౌలర్లపై విరుచుకుపడ్డ యువ ఓపెనర్

వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు బౌలింగ్‌ బెంగ..
క్రీడలు

వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు బౌలింగ్‌ బెంగ..

రాహుల్ విజయ్ డ్యాన్స్‌తో షాకయ్యా.. ఆకాష్ పూరి ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

రాహుల్ విజయ్ డ్యాన్స్‌తో షాకయ్యా.. ఆకాష్ పూరి ఆసక్తికర వ్యాఖ్యలు

పర్యావరణానికి మేలు.. ఎరువుల ఖర్చుకు చెక్!
జనరల్

పర్యావరణానికి మేలు.. ఎరువుల ఖర్చుకు చెక్!

ఏసీసీ రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌.. ఇండియా-ఎ కెప్టెన్‌గా తిలక్ వర్మ
క్రీడలు

ఏసీసీ రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌.. ఇండియా-ఎ కెప్టెన్‌గా తిలక్ వర్మ