3, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సముద్ర దొంగలపై భారత నేవీ, ఎయిర్‌ఫోర్స్ మెరుపు దాడి..

Writer: Chandrika 12:01 PM, 3 నవంబర్, 2026
సముద్ర దొంగలపై భారత నేవీ, ఎయిర్‌ఫోర్స్ మెరుపు దాడి..

భారత నౌకాదళం, వైమానిక దళం సంయుక్తంగా అరేబియా సముద్రంలో సాహసోపేత ఆపరేషన్ నిర్వహించాయి. సోమాలియా సముద్ర దొంగలు హైజాక్ చేసిన ఇరాన్‌కు చెందిన మత్స్యకారుల పడవ ‘అజిని’ని సురక్షితంగా విడిపించాయి. అక్టోబర్ 29న 20 మంది సిబ్బందితో ప్రయాణిస్తున్న ఈ పడవను సముద్ర దొంగలు అపహరించారు. సమాచారం అందుకున్న భారత నేవీ రంగంలోకి దిగి, ముంబయికి సుమారు 3 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న పడవను గుర్తించి అడ్డుకుంది. 48 గంటలపాటు పక్కా ప్రణాళికతో ఆపరేషన్ చేపట్టింది. భారత వైమానిక దళం అందించిన సహకారంతో సముద్ర దొంగలను ఎదుర్కొని పడవను తమ ఆధీనంలోకి తీసుకుంది. నవంబర్ 2న ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా మొత్తం 20 మంది సిబ్బందిని సురక్షితంగా రక్షించారు.

ఈ విజయవంతమైన ఆపరేషన్‌పై రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. 48 గంటలపాటు కొనసాగిన ఆపరేషన్‌లో భారత నౌకాదళం అద్భుతమైన సమన్వయంతో పనిచేసిందని, వైమానిక దళం సకాలంలో అందించిన సహకారం కీలకంగా నిలిచిందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. సముద్రంలో ఎదురయ్యే ముప్పులను సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యం భారత నేవీకి ఉందని ఈ ఆపరేషన్ మరోసారి నిరూపించిందన్నారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భద్రతను కాపాడేందుకు భారత్ తన వంతు కృషిని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో హిందూ మహాసముద్రం, గల్ఫ్ ఆఫ్ ఏడెన్ పరిసరాల్లో సముద్ర దొంగల కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో భారత నౌకాదళం నిరంతర నిఘా కొనసాగిస్తూ అంతర్జాతీయ నౌకలకు భద్రత కల్పిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పర్యావరణానికి మేలు.. ఎరువుల ఖర్చుకు చెక్!

పర్యావరణానికి మేలు.. ఎరువుల ఖర్చుకు చెక్!

ఒంగోలు సమీపంలో తీరం దాటిన తీవ్ర తుఫాను మురసు

ఒంగోలు సమీపంలో తీరం దాటిన తీవ్ర తుఫాను మురసు

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భారతీయుల హవా..

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భారతీయుల హవా..

మెప్మా అడిషనల్ డైరెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు

మెప్మా అడిషనల్ డైరెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు

రాప్తాడు ఘటన.. నిందితుడు హేమంత్ కుడి కాలు తొలగింపు..

రాప్తాడు ఘటన.. నిందితుడు హేమంత్ కుడి కాలు తొలగింపు..

ట్యాగ్లు
భారత నౌకాదళంభారత వైమానిక దళంసముద్ర దొంగలుఅజిని నౌకఅరేబియా సముద్రంసముద్ర రక్షణ ఆపరేషన్రాజ్‌నాథ్ సింగ్హిందూ మహాసముద్రం48 గంటల ఆపరేషన్20 మంది సిబ్బంది రక్షణ
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
ఒమన్ తీరంలో కలకలం

ఒమన్ తీరంలో కలకలం

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారత ఆర్థిక వృద్ధిపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన
బిజినెస్

భారత ఆర్థిక వృద్ధిపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన

సీఎం చంద్రబాబుకు అమిత్‌షా ఫోన్‌..
జనరల్

సీఎం చంద్రబాబుకు అమిత్‌షా ఫోన్‌..

ఏపీ మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌.. అత్యధిక స్థానాల్లో కూటమి ఆధిక్యం
రాజకీయాలు

ఏపీ మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌.. అత్యధిక స్థానాల్లో కూటమి ఆధిక్యం

గ్రామ పంచాయతీల్లో ఈవీ చార్జింగ్ కేంద్రాలు.. కేంద్రం కీలక నిర్ణయం
జనరల్

గ్రామ పంచాయతీల్లో ఈవీ చార్జింగ్ కేంద్రాలు.. కేంద్రం కీలక నిర్ణయం

దీపావళి వేళ పెరుగుతున్న బంగారం ధరలు
బిజినెస్

దీపావళి వేళ పెరుగుతున్న బంగారం ధరలు

గోపిక ఆరోగ్యంపై మణిపాల్‌ ఆస్పత్రి హెల్త్‌ బులెటిన్‌
జనరల్

గోపిక ఆరోగ్యంపై మణిపాల్‌ ఆస్పత్రి హెల్త్‌ బులెటిన్‌

ఐడీబీఐ బ్యాంకు ఉద్యోగుల సమ్మె.. ఖాతాదారులకు కీలక సూచనలు
జనరల్

ఐడీబీఐ బ్యాంకు ఉద్యోగుల సమ్మె.. ఖాతాదారులకు కీలక సూచనలు

మళ్లీ ఫామ్‌లోకి యశస్వి.. కివీస్‌-ఎ బౌలర్లపై విరుచుకుపడ్డ యువ ఓపెనర్
క్రీడలు

మళ్లీ ఫామ్‌లోకి యశస్వి.. కివీస్‌-ఎ బౌలర్లపై విరుచుకుపడ్డ యువ ఓపెనర్

వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు బౌలింగ్‌ బెంగ..
క్రీడలు

వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు బౌలింగ్‌ బెంగ..

రాహుల్ విజయ్ డ్యాన్స్‌తో షాకయ్యా.. ఆకాష్ పూరి ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

రాహుల్ విజయ్ డ్యాన్స్‌తో షాకయ్యా.. ఆకాష్ పూరి ఆసక్తికర వ్యాఖ్యలు

పర్యావరణానికి మేలు.. ఎరువుల ఖర్చుకు చెక్!
జనరల్

పర్యావరణానికి మేలు.. ఎరువుల ఖర్చుకు చెక్!

ఏసీసీ రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌.. ఇండియా-ఎ కెప్టెన్‌గా తిలక్ వర్మ
క్రీడలు

ఏసీసీ రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌.. ఇండియా-ఎ కెప్టెన్‌గా తిలక్ వర్మ