

అమెరికా మధ్యంతర ఎన్నికల వేళ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కాలిఫోర్నియాలో అనుమానిత పౌరసత్వం లేని ఓటర్లకు సంబంధించిన సుమారు 20 వేల బ్యాలెట్లను పక్కన పెట్టి, వారి పౌరసత్వాన్ని ధ్రువీకరించే వరకు లెక్కించకుండా నిలిపివేయాలన్న న్యాయ శాఖ అభ్యర్థనను అమెరికా సుప్రీంకోర్టు తిరస్కరించింది. ప్రభుత్వ వాదన ప్రకారం, ఈ ఓటర్లు అమెరికా పౌరులు కాకపోవచ్చని అనుమానాలున్నాయి. అయితే, ఈ అభ్యర్థనను ఇప్పటికే దిగువ కోర్టులు కూడా తిరస్కరించాయి.
ప్రభుత్వం అందించిన జాబితాలో తప్పులు ఉన్నాయని, అర్హులైన అమెరికా పౌరుల ఓటు హక్కుకు భంగం కలిగే ప్రమాదం ఉందని కాలిఫోర్నియా ఎన్నికల అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతున్న సమయంలో బ్యాలెట్లను వేరు చేయడం ఓట్ల లెక్కింపునకు అంతరాయం కలిగించవచ్చని కోర్టులు పేర్కొన్నాయి. మధ్యంతర ఎన్నికలకు ముందు ఈ నిర్ణయం వెలువడటంతో ట్రంప్ ప్రభుత్వానికి మరో న్యాయపరమైన ఎదురుదెబ్బ తగిలినట్లయింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!