
జనరల్

తెలంగాణలోని గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులు, బిల్లుల చెల్లింపుల్లో జాప్యం లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆదేశాల మేరకు జిల్లా పంచాయతీ అధికారులకు మార్గదర్శకాలు జారీ చేసినట్లు సమాచారం. సర్పంచ్, ఉప సర్పంచ్‌ల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల చెక్కులపై సంతకాల ప్రక్రియ ఆలస్యమవుతున్న నేపథ్యంలో చెల్లింపులు నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
చెక్కుపై సర్పంచ్ సంతకం చేసిన తర్వాత ఉప సర్పంచ్ నిర్ణీత వ్యవధిలో సంతకం చేయాల్సి ఉంటుందని, అనవసరంగా జాప్యం జరిగితే తదుపరి చర్యలు తీసుకునేలా మార్గదర్శకాలు రూపొందించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఉమ్మడి చెక్ పవర్ నిబంధన కారణంగా గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఆటంకాలు ఏర్పడుతున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!