
జనరల్

తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహించిన టీజీటెట్ – ఇన్‌సర్వీస్ టీచర్స్ – 2026 పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీ విడుదలైంది. పరీక్షకు హాజరైన ఉపాధ్యాయులు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి కీని పరిశీలించుకోవచ్చు. తమ సమాధానాలను కీతో సరిపోల్చుకుని ప్రాథమికంగా మార్కులను అంచనా వేసుకోవచ్చు.
ప్రాథమిక కీలో ఏవైనా సమాధానాలపై అభ్యంతరాలు ఉన్న అభ్యర్థులు నేటి నుంచి సెప్టెంబర్ 17 సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలు సమర్పించవచ్చు. ఇందుకోసం అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సంబంధిత లింక్ ద్వారా నిర్ణీత విధానంలో అభ్యంతరాలను నమోదు చేయాలి. గడువు ముగిసిన తర్వాత అభ్యంతరాలకు అవకాశం ఉండదని, అభ్యర్థులు నిర్దేశిత సమయంలోనే ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు సూచించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!