

మేషం: ఉద్యోగంలో బాధ్యతలను శ్రద్ధగా నిర్వహించాలి. ఆరోగ్య నియమాలను పాటించడం అవసరం. అనవసర వాదవివాదాలకు దూరంగా ఉండటం మంచిది. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం.
వృషభం: చేపట్టిన పనుల్లో శ్రమ పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. మీ అభివృద్ధిని ఇష్టపడని వారి మాటలను పట్టించుకోకపోవడం మంచిది. కలహాలకు తావివ్వకుండా ప్రశాంతంగా ఉండాలి. శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం మేలు చేస్తుంది.
మిథునం: నిబద్ధతతో పనిచేస్తే విజయాలు సాధిస్తారు. తరచూ నిర్ణయాలు మార్చడం వల్ల ఇబ్బందులు రావచ్చు. బంధువులతో ప్రేమగా, సంయమనంతో వ్యవహరించాలి. ఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం.
కర్కాటకం: పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరిచినా మనోధైర్యంతో వాటిని అధిగమిస్తారు. అనవసర ఖర్చులు పెరగకుండా జాగ్రత్తపడాలి. కనకధారా స్తోత్రం పఠించడం మేలు చేస్తుంది.
సింహం: మీ నిబద్ధత, ధర్మబద్ధమైన ఆలోచనలు మీకు రక్షణగా నిలుస్తాయి. అందరినీ కలుపుకొని ముందుకు సాగడం మంచిది. కొన్ని సంఘటనలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ముఖ్య వ్యవహారాల్లో పురోగతి కనిపిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం.
కన్య: మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. అభివృద్ధికి సంబంధించిన కొత్త ఆలోచనలు చేస్తారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనవసర అపోహలతో సమయాన్ని వృథా చేయకండి. ఈశ్వర దర్శనం మేలు చేస్తుంది.
తుల: చేపట్టిన పనుల్లో ఆటంకాలు వచ్చినా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. మనోబలంతో ముందుకు సాగాలి. ఒక వార్త కాస్త మనస్తాపాన్ని కలిగించవచ్చు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. శివారాధన మేలు చేస్తుంది.
వృశ్చికం: దైవబలం అనుకూలంగా ఉంటుంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. ఒక ముఖ్య వ్యవహారంలో నైతిక విజయం సాధిస్తారు. ఆర్థికంగా మంచి ఫలితాలు ఉంటాయి. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదైవ ఆరాధన మరింత శుభాన్ని ఇస్తుంది.
ధనుస్సు: మనోధైర్యంతో చేపట్టిన పనులను పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆత్మీయులతో వాగ్వాదాలకు దూరంగా ఉండాలి. భయాందోళనలను పక్కనపెట్టి ముందుకు సాగండి. చెడు సాంగత్యం వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దుర్గా స్తుతి పఠించడం శుభప్రదం.
మకరం: ప్రయత్నాలకు కార్యసిద్ధి లభిస్తుంది. కీలక నిర్ణయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఖర్చులు అదుపు తప్పకుండా చూసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. మాటపట్టింపులకు దూరంగా ఉండాలి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. లక్ష్మీదేవి ఆరాధన శ్రేయస్కరం.
కుంభం: ఉత్సాహంగా పనిచేసి చేపట్టిన పనులను పూర్తి చేస్తారు. ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉంటాయి. అనవసర ప్రయాణాల వల్ల సమయం వృథా కాకుండా చూసుకోవాలి. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. కలహాలకు తావివ్వకండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మేలు చేస్తుంది.
మీనం: అదృష్టం అనుకూలంగా ఉంటుంది. బుద్ధిబలంతో పనులను సమర్థంగా పూర్తి చేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. స్థిరాస్తి కొనుగోలు విషయాల్లో ముందడుగు వేస్తారు. సమాజంలో గౌరవం, గుర్తింపు పెరుగుతుంది. కలహాలకు దూరంగా ఉండటం మంచిది. ఇష్టదైవ ఆరాధన మేలు చేస్తుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!