
గాసిప్స్

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అమ్మమ్మ కన్నుమూసినట్లు ఢిల్లీ పోలీసులు ఆయనకు సమాచారం అందించారు. ప్రస్తుతం పోలీసుల నిర్బంధంలో ఉన్న అభిజీత్ నిరసన కొనసాగిస్తున్నారు. అమ్మమ్మ మరణవార్త తెలియజేసిన పోలీసులు.. నిరసనను కొనసాగించాలా లేదా అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఇంటికి తిరిగి వెళ్లాలా అనేది ఆయనే నిర్ణయించుకోవాలని స్పష్టం చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
అభిజీత్ తీసుకునే నిర్ణయాన్ని బట్టి తదుపరి చర్యలు ఉంటాయని పోలీసు వర్గాలు వెల్లడించాయి. నిరసన కొనసాగించాలా, కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లాలా అనే విషయంలో ఆయన నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!