

బీహార్లోని వైశాలి జిల్లాలో గంగా నదిలో పడవ బోల్తా పడిన ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. విందుకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. నదిలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గల పూర్తి కారణాలు, పడవలో ప్రయాణిస్తున్న వారి సంఖ్యకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఈ ఘటనపై బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌధరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించినట్లు సమాచారం. బాధితులకు అవసరమైన సహాయం అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. సహాయక బృందాలు నదిలో గాలింపు చర్యలను కొనసాగిస్తున్నాయి. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!