
సినిమాలు

బ్రిటన్‌లో తీవ్ర ఎండలు, ఉక్కపోత ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS) ఆసుపత్రుల్లో శస్త్రచికిత్సలు చేసే వైద్యులు తీవ్రమైన వేడి, డీహైడ్రేషన్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీంతో కొందరు వైద్యులు సర్జరీలను మధ్యలో నిలిపివేసి, శరీరాన్ని చల్లబరుచుకున్న తర్వాతే మళ్లీ చికిత్స కొనసాగిస్తున్నట్లు సమాచారం.
రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇంగ్లాండ్ అధ్యక్షుడు డాక్టర్ టిమ్ లేన్ మాట్లాడుతూ, పాత ఎన్‌హెచ్‌ఎస్ భవనాల్లో తగిన శీతలీకరణ సౌకర్యాలు లేకపోవడంతో అనేక శస్త్రచికిత్సలు ఆలస్యం అవుతున్నాయని, కొన్ని రద్దవుతున్నాయని తెలిపారు. కొన్ని ఆపరేషన్ థియేటర్లలో అధిక తేమ కారణంగా శస్త్రచికిత్స పరికరాలపై నీటి బిందువులు ఏర్పడుతున్నాయని, రోగులు చిన్న ఫ్యాన్లు మాత్రమే ఉన్న గదుల్లో వేచి ఉండాల్సి వస్తోందని చెప్పారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!