
జనరల్

హిందూ మహాసముద్రంలో మారిషస్ సమీపంలో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.4గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. భూకంపం కారణంగా మారిషస్ ద్వీపంలోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు చోటుచేసుకోవడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం సంభవించలేదు. భవనాలు దెబ్బతిన్నట్లు కూడా ఎలాంటి నివేదికలు అందలేదని అధికారులు తెలిపారు.
మారిషస్‌తో పాటు సమీపంలోని రీయూనియన్ దీవులకు కూడా సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. ప్రస్తుతం పరిస్థితి సాధారణంగానే ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం ప్రకటించింది. భూకంపం అనంతర పరిస్థితులను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి నష్టం జరగలేదని ప్రాథమిక సమాచారం వెల్లడిస్తున్నప్పటికీ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!