
రాజకీయాలు

అయోధ్య రామాలయ విరాళాల దుర్వినియోగం కేసులో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అక్రమంగా సంపాదించిన ఆస్తులను స్వాధీనం చేసుకోవడంతో పాటు అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని నిర్ణయించింది. ఇప్పటికే నిందితుడు లవ్‌కుష్ మిశ్రా నిర్మిస్తున్న రెండంతస్తుల ఇంటికి అయోధ్య అభివృద్ధి సంస్థ నోటీసులు జారీ చేసింది. ఈ ఇల్లు అయోధ్య–లక్నో హైవే సమీపంలో నిర్మాణంలో ఉంది.
మరోవైపు ఆలయ ట్రస్టుకు గత ఐదేళ్లలో వచ్చిన నిధులపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఆడిట్ నిర్వహిస్తోంది. ట్రస్టుకు అందిన విరాళాల వినియోగంపై పూర్తి స్థాయిలో పరిశీలించి ఆర్థిక అక్రమాలు జరిగాయా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!