
రాజకీయాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీఎస్‌యూలు, కార్పొరేషన్లు, సొసైటీలులో పనిచేస్తున్న ఉద్యోగులకు శుభవార్త తెలిపింది. ప్రస్తుతం ఉన్న 60 ఏళ్ల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. మంత్రిమండలి ఆమోదానికి అనుగుణంగా తీసుకున్న ఈ నిర్ణయం 2022 జనవరి 1 నుంచి రిట్రోస్పెక్టివ్‌గా అమల్లోకి రానుంది.
60 ఏళ్లకు పదవీ విరమణ పొందిన అర్హులైన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకునే అవకాశం కల్పించింది. అయితే తిరిగి విధుల్లో చేరే వరకు ఉన్న గ్యాప్ పీరియడ్‌కు జీతం ఉండదని, ఆ కాలాన్ని సీనియారిటీ లేదా ప్రమోషన్ల కోసం పరిగణనలోకి తీసుకోబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాల మేరకు 62 ఏళ్ల వరకు పనిచేసిన ఉద్యోగులకు పూర్తి సర్వీస్ బెనిఫిట్స్ అందించనున్నట్లు తెలిపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!