

అమెరికా మరియు ఇరాన్ మధ్య ఇటీవల నెలకొన్న ఉద్రిక్తతలకు తెరదించుతూ చారిత్రాత్మక శాంతి ఒప్పందం కుదిరింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయాన్ని ప్రకటిస్తూ, ఇరు దేశాల అధ్యక్షులు పారిస్ లో జరిగిన చర్చల అనంతరం ఒప్పందంపై సంతకాలు చేసినట్లు వెల్లడించారు. ఈ ఒప్పందంలో భాగంగా 14 కీలక అంశాలను అమెరికా విడుదల చేసింది. ఈ చర్య మధ్యప్రాచ్య ప్రాంతంలో శాంతి, స్థిరత్వానికి కొత్త మార్గాన్ని చూపనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ ఒప్పందంలో లెబనాన్ ను కూడా భాగస్వామిగా చేర్చడం విశేషం. లెబనాన్‌తో పాటు అన్ని వైపులా సైనిక చర్యలను నిలిపివేయాలని ఇరు దేశాలు అంగీకరించాయి. అలాగే 30 రోజుల్లో హర్మూజ్ జలసంధిపై ఉన్న దిగ్బంధాన్ని పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయించాయి. అణ్వాయుధాలను ఎప్పటికీ తయారు చేయబోమని ఇరాన్ మరోసారి స్పష్టం చేసింది. యురేనియం అంశానికి ఒప్పందంలో తక్కువ ప్రాధాన్యం లభించడం కూడా చర్చనీయాంశంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!