6, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

చంద్రుడిపై అణు రియాక్టర్లకు అగ్రరాజ్యాల పోటీ..

Writer: Chandrika 06:45 AM, 6 అక్టోబర్, 2026
చంద్రుడిపై అణు రియాక్టర్లకు అగ్రరాజ్యాల పోటీ..

అంతరిక్ష పరిశోధనలో మరో కీలక పోటీకి తెరలేస్తోంది. అమెరికా, రష్యా, చైనాలు చంద్రుడిపై అణు రియాక్టర్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. చంద్రుడిపై శాశ్వత స్థావరాల నిర్మాణం, వనరుల అన్వేషణ, భవిష్యత్‌ లోతైన అంతరిక్ష యాత్రలకు అణుశక్తి కీలకమని ఈ దేశాలు భావిస్తున్నాయి. నివేదికల ప్రకారం.. చంద్రుడి దక్షిణ ధృవం సమీపంలో 2030 డిసెంబరు నాటికి నిరంతరం పనిచేసే అణు రియాక్టర్‌ను ఏర్పాటు చేయాలని నాసా లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు చైనాతో కలిసి 2036 నాటికి ‘సెలీనా’ పేరుతో అణు రియాక్టర్‌ను ఏర్పాటు చేసేందుకు రష్యా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రుడిపై రాత్రి సమయం ఎక్కువగా ఉండటం వల్ల సౌరశక్తిపై పూర్తిగా ఆధారపడటం కష్టం. ఈ నేపథ్యంలో దీర్ఘకాలం విద్యుత్‌ అందించగల అణు రియాక్టర్లు శాశ్వత స్థావరాలకు కీలకంగా మారనున్నాయి. నాసా ప్రతిపాదించిన లూనార్‌ రియాక్టర్‌-1 సుమారు 20 కిలోవాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ ఐదేళ్ల వరకు పనిచేయగలదని అంచనా వేస్తున్నారు. రష్యా ప్రతిపాదిస్తున్న సెలీనా రియాక్టర్‌ 10 కిలోవాట్ల వరకు విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ దాదాపు పదేళ్లపాటు స్వయంప్రతిపత్తితో పనిచేయగలదని సమాచారం.

అయితే చంద్రుడిపై అణు రియాక్టర్ల ఏర్పాటుపై భద్రత, అంతర్జాతీయ చట్టాలకు సంబంధించిన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రాకెట్‌ ప్రయోగాల్లో వైఫల్యం లేదా ఇతర ప్రమాదాల కారణంగా రేడియోధార్మిక పదార్థాలు వ్యాపించే ముప్పు ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. చంద్రుడిపై వ్యోమగాములు, రోవర్లు, ఇతర పరికరాలను రేడియేషన్‌ నుంచి రక్షించేందుకు ప్రత్యేక భద్రతా వ్యవస్థలు అవసరమవుతాయి. ప్రయోగ సమయంలో ప్రమాదాలను తగ్గించేందుకు రియాక్టర్లను పూర్తిగా నిష్క్రియాత్మక స్థితిలో చంద్రుడిపైకి తీసుకెళ్లాలని అమెరికా, రష్యాలు భావిస్తున్నాయి. మరోవైపు 1967 నాటి అంతరిక్ష ఒప్పందం ప్రకారం చంద్రుడిపై ఏ దేశమూ సార్వభౌమ హక్కు ప్రకటించకూడదు. అయితే అక్కడ ఏర్పాటు చేసే స్థావరాల చుట్టుపక్కల ప్రాంతాలపై నియంత్రణ, చంద్రుడి వనరుల వినియోగం వంటి అంశాలపై స్పష్టత ఇంకా పూర్తిగా లేదు. అణు రియాక్టర్ల ఆధారంగా ఏర్పడే స్థావరాలు నియంత్రిత ప్రాంతాలుగా మారే అవకాశంపై అమెరికాకు ఆందోళనలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులన్నీ ప్రతిపాదనల దశలోనే ఉండగా.. వాటిని చంద్రుడిపై సురక్షితంగా ఏర్పాటు చేసి, దీర్ఘకాలం నిర్వహించగల సామర్థ్యాన్ని ఆయా దేశాలు నిరూపించాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
 విశాఖలో భారీ నౌకను ప్రారంభించిన రాజ్‌నాథ్‌సింగ్

విశాఖలో భారీ నౌకను ప్రారంభించిన రాజ్‌నాథ్‌సింగ్

ప్రమాదంలో రామప్ప దేవాలయం?

ప్రమాదంలో రామప్ప దేవాలయం?

కార్బన్‌ డయాక్సైడ్‌తో ఆరోగ్యానికి ముప్పు.. తాజా అధ్యయనంలో కీలక విషయాలు

కార్బన్‌ డయాక్సైడ్‌తో ఆరోగ్యానికి ముప్పు.. తాజా అధ్యయనంలో కీలక విషయాలు

భారత ఆసుపత్రుల్లోకి విదేశీ పీఈ పెట్టుబడులు..

భారత ఆసుపత్రుల్లోకి విదేశీ పీఈ పెట్టుబడులు..

తెలంగాణ విద్యుత్‌ వినియోగదారులకు షాక్‌..

తెలంగాణ విద్యుత్‌ వినియోగదారులకు షాక్‌..

ట్యాగ్లు
చంద్రుడిపై అణు రియాక్టర్నాసాఅంతరిక్ష పరిశోధనఅమెరికా రష్యా చైనాచంద్ర స్థావరాలుఅణుశక్తిచంద్రయాత్రఅంతరిక్ష సాంకేతికతచంద్రుడి వనరులుఅంతరిక్ష ఒప్పందంస్పేస్ రేస్అణు విద్యుత్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
ఇందిరా ఏకాదశి 2026: ఈ చోట్ల దీపాలు వెలిగిస్తే పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయట!

ఇందిరా ఏకాదశి 2026: ఈ చోట్ల దీపాలు వెలిగిస్తే పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయట!

AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ విమానంలో సాంకేతిక లోపం
జనరల్

బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ విమానంలో సాంకేతిక లోపం

సూపర్ ఇంటెలిజెన్స్ అత్యంత ప్రమాదకరంగా మారొచ్చు. – సాఫ్ట్‌బ్యాంక్ సీఈఓ  మసయోషి సన్
జనరల్

సూపర్ ఇంటెలిజెన్స్ అత్యంత ప్రమాదకరంగా మారొచ్చు. – సాఫ్ట్‌బ్యాంక్ సీఈఓ మసయోషి సన్

 విశాఖలో భారీ నౌకను ప్రారంభించిన రాజ్‌నాథ్‌సింగ్
జనరల్

విశాఖలో భారీ నౌకను ప్రారంభించిన రాజ్‌నాథ్‌సింగ్

ఆప్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన ప్రియాంక కక్కర్‌..
రాజకీయాలు

ఆప్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన ప్రియాంక కక్కర్‌..

శీను–పండు ప్రేమకథకు 30 ఏళ్లు.. ‘నిన్నే పెళ్లాడతా’ క్రేజ్‌ ఇప్పటికీ ఎవర్‌గ్రీన్‌
సినిమాలు

శీను–పండు ప్రేమకథకు 30 ఏళ్లు.. ‘నిన్నే పెళ్లాడతా’ క్రేజ్‌ ఇప్పటికీ ఎవర్‌గ్రీన్‌

భారత్‌లో హోండా కొత్త వ్యూహం..
బిజినెస్

భారత్‌లో హోండా కొత్త వ్యూహం..

ప్రమాదంలో రామప్ప దేవాలయం?
జనరల్

ప్రమాదంలో రామప్ప దేవాలయం?

చంద్రుడిపై అణు రియాక్టర్లకు అగ్రరాజ్యాల పోటీ..
జనరల్

చంద్రుడిపై అణు రియాక్టర్లకు అగ్రరాజ్యాల పోటీ..

ఏఐ ఏజెంట్లకు భావోద్వేగాలు వచ్చాయా?
టెక్నాలజీ

ఏఐ ఏజెంట్లకు భావోద్వేగాలు వచ్చాయా?

కార్బన్‌ డయాక్సైడ్‌తో ఆరోగ్యానికి ముప్పు.. తాజా అధ్యయనంలో కీలక విషయాలు
జనరల్

కార్బన్‌ డయాక్సైడ్‌తో ఆరోగ్యానికి ముప్పు.. తాజా అధ్యయనంలో కీలక విషయాలు

భారత ఆసుపత్రుల్లోకి విదేశీ పీఈ పెట్టుబడులు..
జనరల్

భారత ఆసుపత్రుల్లోకి విదేశీ పీఈ పెట్టుబడులు..

భారత్‌ vs వెస్టిండీస్‌ తొలి టీ20: లఖ్‌నవూలో కరీబియన్‌ సవాల్‌.. శ్రేయస్‌ సేనకు అసలు పరీక్ష
క్రీడలు

భారత్‌ vs వెస్టిండీస్‌ తొలి టీ20: లఖ్‌నవూలో కరీబియన్‌ సవాల్‌.. శ్రేయస్‌ సేనకు అసలు పరీక్ష