

కావేరీ నదిపై కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదించిన మేకెదాటు డ్యామ్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ శుక్రవారం ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది. ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టి, ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని కోరారు. తమిళనాడు రైతుల నీటి హక్కులను కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
ఈ అంశం కాంగ్రెస్ పార్టీలో కూడా రాజకీయ చర్చకు దారితీసింది. తమిళనాడు కాంగ్రెస్ నేతలు విజయ్ ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతు తెలపగా, కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మేకెదాటు ప్రాజెక్టుకు అనుకూలంగా ఉంది. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేయడంతో పార్టీ అధిష్టానం ఇరకాటంలో పడిన పరిస్థితి నెలకొంది. ఈ అంశంపై కాంగ్రెస్ హైకమాండ్ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!