
టెక్నాలజీ

కర్ణాటకలో ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తికి దారితీసింది. కేబినెట్‌లో చోటు దక్కకపోవడంతో పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పదవులు ఆశించిన నేతలకు అవకాశం లేకపోవడంతో పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే యశ్వంతరాయగౌడ పాటిల్ స్పీకర్‌కు తన రాజీనామా లేఖను పంపించారు. మరో ఎమ్మెల్యే బెళూరు గోపాలకృష్ణ తాను మంగళవారం రాజీనామా చేస్తానని ప్రకటించారు. తనతో పాటు మరో 10 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసే అవకాశం ఉందని ఆయన పేర్కొనడంతో కర్ణాటక కాంగ్రెస్‌లో రాజకీయ పరిణామాలు మరింత ఆసక్తికరంగా మారాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!