
జనరల్

కోర్టు ఆదేశాలు అమల్లో ఉన్నప్పటికీ హైడ్రా చేపట్టిన కూల్చివేతల వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను విధుల నుంచి తప్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
న్యాయస్థానం వ్యాఖ్యానిస్తూ, ఇది "రూల్ ఆఫ్ మెన్" "రూల్ ఆఫ్ లా"పై పైచేయి సాధించేందుకు చేసిన ప్రయత్నానికి నిదర్శనమని పేర్కొంది. కోర్టు ఆదేశాలను నిర్లక్ష్యం చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరమని హెచ్చరిస్తూ, ప్రభుత్వ అధికారులు చట్ట పరిధిలోనే విధులు నిర్వహించాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!