

యుద్ధ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో ఇరాన్లో సాధారణ పరిస్థితులు క్రమంగా పునరుద్ధరించబడుతున్నాయి. అయితే ఇప్పుడు ఆ దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడమే. ఆంక్షల సడలింపు, విదేశీ పెట్టుబడుల అవకాశాలు, స్తంభింపజేసిన విదేశీ ఆస్తుల విడుదల వంటి పరిణామాలు ఇరాన్‌కు కొంత ఊరటనిస్తున్నాయి. యుద్ధం ముగిసిన తర్వాత ఇరాన్ కరెన్సీ రియాల్ కూడా కొంత బలపడింది.
అయితే ఆర్థిక పునరుద్ధరణ అంత సులభం కాదు. చమురు, పెట్రోకెమికల్, స్టీల్ రంగాలు యుద్ధ ప్రభావంతో తీవ్ర నష్టాన్ని చవిచూశాయి. ఎఫ్ఏటీఎఫ్ బ్లాక్‌లిస్ట్‌లో కొనసాగుతుండటం, అంతర్జాతీయ బ్యాంకింగ్ వ్యవస్థలో పరిమిత అవకాశాలు, విదేశీ పెట్టుబడులపై అనిశ్చితి వంటి అంశాలు ఇరాన్‌కు సవాళ్లుగా మారాయి. ఆంక్షలు పూర్తిగా తొలగితే చమురు ఎగుమతులు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, పరిశ్రమల పునర్నిర్మాణం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, విదేశీ పెట్టుబడుల ఆకర్షణ కోసం సంవత్సరాల సమయం పట్టే అవకాశం ఉంది. సుమారు 300 బిలియన్ డాలర్ల పునర్నిర్మాణ వ్యయం ఇరాన్‌కు పెద్ద పరీక్షగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!