

విమానాల ఇంధనం ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్)లో ఇథనాల్ కలపాలనే ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వానికి లేదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఈ అంశంపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను పూర్తిగా అవాస్తవమని ఖండించారు. విమాన భద్రతపై తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం వల్ల ప్రయాణికుల్లో అనవసర ఆందోళన కలుగుతుందని తెలిపారు. ప్రయాణికుల భద్రతే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, ఏటీఎఫ్‌లో ఇథనాల్ కలపడం వల్ల భద్రతకు ముప్పు ఏర్పడుతుందని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన మంత్రి, ఇథనాల్ మరియు సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ (ఎస్ఏఎఫ్) పూర్తిగా వేర్వేరు ఇంధనాలని వివరించారు. ఎస్ఏఎఫ్‌కు అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఐసీఏఓ) గుర్తింపు ఉందని, కఠిన భద్రతా ప్రమాణాలు పూర్తి చేసిన తర్వాతే ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తున్నారని తెలిపారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!