

హైదరాబాద్‌లోని కాటేదాన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో నిర్వహించిన లెగసీ ఫైటింగ్ ఛాంపియన్‌షిప్ రెండో ఎడిషన్ ఫైట్ నైట్ కార్యక్రమంలో తెలంగాణ క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. క్రీడాకారుల పరిచయ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, శాట్స్ చైర్మన్ శివసేన రెడ్డితో కలిసి ఫైటర్లను అభినందించారు. అనంతరం జరిగిన తొలి పోటీలో హైదరాబాద్‌కు చెందిన బాస సశ్రీక్, ఇండోర్‌కు చెందిన అరుణ్ వర్మ తలపడగా, విజేతను మంత్రి శ్రీహరి అభినందించి సన్మానించారు. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు మార్షల్ ఆర్ట్స్, పోరాట క్రీడలకు మరింత ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.
రాష్ట్రంలో ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వారికి అవసరమైన శిక్షణ, మౌలిక వసతులు, మెరుగైన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ క్రీడా విధానం ద్వారా క్రీడా రంగాన్ని మరింత బలోపేతం చేసి, రాష్ట్ర క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో సాగగా, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఫైటర్లను ప్రోత్సహించారు. క్రీడల్లో గెలుపుతో పాటు క్రమశిక్షణ, పట్టుదల, పోరాట స్ఫూర్తి కూడా ముఖ్యమని, యువత క్రీడల వైపు అడుగులు వేయాలని మంత్రి శ్రీహరి ఆకాంక్షించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!