26, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నక్షత్రం చనిపోయినా గ్రహాలు బతికే ఉంటాయా?

Writer: Chandrika 10:23 AM, 18 నవంబర్, 2026
నక్షత్రం చనిపోయినా గ్రహాలు బతికే ఉంటాయా?

జీవుల మాదిరిగానే నక్షత్రాలకూ జీవితకాలం ఉంటుంది. చివరికి అవి కూడా అంతమవుతాయి. మన సౌర కుటుంబానికి కేంద్రంగా ఉన్న సూర్యుడి ప్రస్థానం కూడా మరో 500 కోట్ల ఏళ్ల తర్వాత ముగియనుంది. అయితే ఒక నక్షత్రం అంతరించిన తర్వాత దాని చుట్టూ పరిభ్రమించే గ్రహాల పరిస్థితి ఏమవుతుంది? అవి పూర్తిగా నాశనమవుతాయా? లేక కొన్ని మనుగడ సాగిస్తాయా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్న ఖగోళ శాస్త్రవేత్తలకు జె1328-1450 అనే మృత నక్షత్రం కీలక ఆధారాలను అందించింది. ఈ నక్షత్రం ప్రస్తుతం శ్వేత మరుగుజ్జు తారగా మారింది. దాని వెలుపలి పొరలు తొలగిపోవడంతో అత్యంత సాంద్రత కలిగిన కేంద్ర భాగం మాత్రమే మిగిలింది. అయితే దాని చుట్టూ రెండు విభిన్న వాయు, ధూళి వలయాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిలో విచ్ఛిన్నమైన గ్రహాలకు సంబంధించిన అవశేషాలు ఉన్నట్లు భావిస్తున్నారు. నక్షత్రం తన చివరి దశకు చేరుకున్నప్పటికీ కొన్ని చిన్న గ్రహాలు పూర్తిగా నాశనం కాకుండా మిగిలి ఉండవచ్చని ఈ పరిశోధన సూచిస్తోంది.

సూర్యుడిలో జరిగే కేంద్రక సంలీన ప్రక్రియ ద్వారా హైడ్రోజన్ హీలియంగా మారుతూ శక్తి విడుదలవుతుంది. మరో 500 కోట్ల ఏళ్లకు సూర్యుడి కేంద్రంలోని హైడ్రోజన్ నిల్వలు పూర్తవుతాయి. దీంతో అది భారీగా విస్తరించి రెడ్ జెయింట్‌గా మారుతుంది. ఈ క్రమంలో కొన్ని గ్రహాలను తనలో కలిపేసుకునే అవకాశం ఉంది. అనంతరం వెలుపలి పొరలు అంతరిక్షంలోకి విడిపోయి, అత్యంత సాంద్రత కలిగిన కోర్ శ్వేత మరుగుజ్జు తారగా మిగులుతుంది. అయితే జె1328-1450 చుట్టూ గతంలో గమనించిన శ్వేత మరుగుజ్జు తారల కంటే భిన్నంగా రెండు వలయాలు కనిపించడం విశేషం. చిలీలోని యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీకి చెందిన వెరీ లార్జ్ టెలిస్కోప్ సాయంతో శాస్త్రవేత్తలు వీటి ఉనికిని గుర్తించారు. గ్రహాల అవశేషాలైన ప్లానెటిసిమాల్స్ తమ గురుత్వాకర్షణ శక్తితో ఈ రెండు వలయాలను వేర్వేరుగా ఉంచుతున్నాయని పరిశోధకులు భావిస్తున్నారు. వీటిలో ఒకటి కొన్ని కిలోమీటర్ల వ్యాసం కలిగి ఉండగా, మరొకటి ప్లూటో లేదా చంద్రుడి పరిమాణంలో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా లోపలి వలయంలో మెగ్నీషియం ఎక్కువగా ఉండటం, వెలుపలి వలయంలో అది తక్కువగా ఉండటం గమనించారు. ఈ రెండు వలయాలు ఒకే గ్రహంలోని వేర్వేరు పొరల నుంచి లేదా రెండు వేర్వేరు గ్రహాల అవశేషాల నుంచి ఏర్పడి ఉండవచ్చని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పార్లమెంట్ ఉభయ సభల ప్రత్యేక సమావేశాలకు కేంద్రం నిర్ణయం

పార్లమెంట్ ఉభయ సభల ప్రత్యేక సమావేశాలకు కేంద్రం నిర్ణయం

రాజ్యాంగాన్ని ప్రదర్శించడమే కాదు చదివి అర్థం చేసుకోవాలి: అమిత్‌షా

రాజ్యాంగాన్ని ప్రదర్శించడమే కాదు చదివి అర్థం చేసుకోవాలి: అమిత్‌షా

గోల్కొండ కంటోన్మెంట్‌లో శిక్షణ విమానానికి ప్రమాదం

గోల్కొండ కంటోన్మెంట్‌లో శిక్షణ విమానానికి ప్రమాదం

ప్రభుత్వ ఉద్యోగులకు పితృత్వ సెలవుల మంజూరు

ప్రభుత్వ ఉద్యోగులకు పితృత్వ సెలవుల మంజూరు

ఉక్రెయిన్‌కు అమెరికా భారీ రక్షణ ప్యాకేజీ
ట్యాగ్లు
శ్వేత మరుగుజ్జు తారజె1328-1450సూర్యుడి భవిష్యత్తుఖగోళ పరిశోధనఅంతరిక్ష విశేషాలుగ్రహాల అవశేషాలురెడ్ జెయింట్సౌర కుటుంబంనక్షత్రాల అంతంసైన్స్ అండ్ టెక్నాలజీ
AdvertisementAdvertisement

ఉక్రెయిన్‌కు అమెరికా భారీ రక్షణ ప్యాకేజీ

అనారోగ్యంతో మరోసారి ఆసుపత్రిలో చేరిన శరద్ పవార్

అనారోగ్యంతో మరోసారి ఆసుపత్రిలో చేరిన శరద్ పవార్

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గ్రహశకలాల ముప్పును అడ్డుకునే దిశగా నాసా కీలక విజయం
జనరల్

గ్రహశకలాల ముప్పును అడ్డుకునే దిశగా నాసా కీలక విజయం

ఏడాదిలో లక్ష ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు పూర్తి చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

ఏడాదిలో లక్ష ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు పూర్తి చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

జ్యూరీ కమిటీ చైర్మన్‌గా నందమూరి బాలకృష్ణ నియామకం
సినిమాలు

జ్యూరీ కమిటీ చైర్మన్‌గా నందమూరి బాలకృష్ణ నియామకం

అంత్యక్రియలకూ ముందస్తు బుకింగ్ సేవలు అందిస్తున్న ఢిల్లీ స్టార్టప్
జనరల్

అంత్యక్రియలకూ ముందస్తు బుకింగ్ సేవలు అందిస్తున్న ఢిల్లీ స్టార్టప్

కుటుంబ సమేతంగా కొత్తగూడెం వచ్చిన చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన తుమ్మల
జనరల్

కుటుంబ సమేతంగా కొత్తగూడెం వచ్చిన చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన తుమ్మల

మెటాపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్
జనరల్

మెటాపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్

సర్దార్ గబ్బర్ సింగ్ నుంచి తప్పుకోవడానికి కారణం చెప్పిన సంపత్ నంది
సినిమాలు

సర్దార్ గబ్బర్ సింగ్ నుంచి తప్పుకోవడానికి కారణం చెప్పిన సంపత్ నంది

మహారాజ సినిమాలో సచనా నటనపై టామ్ హ్యాంక్స్ ప్రశంసలు
సినిమాలు

మహారాజ సినిమాలో సచనా నటనపై టామ్ హ్యాంక్స్ ప్రశంసలు

యూపీ ఎన్నికల బరిలో సమాజ్‌వాదీ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన అఖిలేశ్ యాదవ్
రాజకీయాలు

యూపీ ఎన్నికల బరిలో సమాజ్‌వాదీ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన అఖిలేశ్ యాదవ్

పార్లమెంట్ ఉభయ సభల ప్రత్యేక సమావేశాలకు కేంద్రం నిర్ణయం
జనరల్

పార్లమెంట్ ఉభయ సభల ప్రత్యేక సమావేశాలకు కేంద్రం నిర్ణయం

రాజ్యాంగాన్ని ప్రదర్శించడమే కాదు చదివి అర్థం చేసుకోవాలి: అమిత్‌షా
జనరల్

రాజ్యాంగాన్ని ప్రదర్శించడమే కాదు చదివి అర్థం చేసుకోవాలి: అమిత్‌షా

గోల్కొండ కంటోన్మెంట్‌లో శిక్షణ విమానానికి ప్రమాదం
జనరల్

గోల్కొండ కంటోన్మెంట్‌లో శిక్షణ విమానానికి ప్రమాదం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!