
జనరల్

తెలంగాణ రైతులకు ఇకపై వాట్సాప్ ద్వారా ముందస్తు వాతావరణ సూచనలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. వర్షాలు, గాలులు, ఉష్ణోగ్రత మార్పులపై అలర్ట్స్ నేరుగా రైతుల మొబైల్‌కి చేరేలా వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు. జిల్లా, మండల స్థాయిలో ఖచ్చితమైన వాతావరణ అంచనాలు అందించేందుకు డెవలప్మెంట్ ఇన్నోవేషన్ ల్యాబ్ (DIL)తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.
ఈ కార్యక్రమం ద్వారా IMD సహకారంతో రియల్ టైమ్ వాతావరణ సమాచారం వాట్సాప్ ద్వారా రైతులకు చేరనుంది. వాతావరణ మార్పుల వల్ల జరుగుతున్న నష్టాలను తగ్గించడమే ప్రధాన లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి రైతులకు మరింత ఉపయోగకరమైన సమాచారాన్ని అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!