
రాజకీయాలు

జమ్మూకశ్మీర్‌లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు తీవ్ర బీభత్సం సృష్టిస్తున్నాయి. పూంచ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. పలు ప్రాంతాల్లో రహదారులు దెబ్బతినగా, సహాయక బృందాలు సహాయ చర్యలను వేగవంతం చేశాయి.
వర్షాలు, కొండచరియల కారణంగా పూంచ్ జిల్లాలో మొత్తం మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. బాధితులకు అన్ని విధాలా సహాయం అందించాలని అధికారులను ఆదేశించినట్లు ప్రభుత్వం తెలిపింది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!