
జనరల్

ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్‌కు కేరళలో అభిమానులు అపూర్వ ఆదరణ చూపించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన థియేటర్ ప్రదర్శనలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేశాయి. మొత్తం 50 షోల ద్వారా రూ.30 లక్షల గ్రాస్ వసూలు కావడం అక్కడ ఫుట్‌బాల్‌కు ఉన్న క్రేజ్‌ను మరోసారి నిరూపించింది.
ఈ ప్రత్యేక ప్రదర్శనలకు 13 వేలకుపైగా టికెట్లు అమ్ముడయ్యాయి. ఫుట్‌బాల్‌ను ఎంతో అభిమానించే కేరళ ప్రజలు ప్రపంచకప్ ఫైనల్‌ను కూడా పండుగలా జరుపుకున్నారు. అంతర్జాతీయ ఫుట్‌బాల్ టోర్నీలకు కేరళలో ఉన్న ఆదరణ మరోసారి స్పష్టమైందని సినీ, క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి.













కామెంట్స్ (1)
Excellent