

హైదరాబాద్‌లో భారీ స్థాయిలో గంజాయి విక్రయాలు నిర్వహిస్తున్న మహిళ మరోసారి పోలీసుల కళ్లుగప్పి పరారైంది. ఐటీ కారిడార్‌లోని సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని గంజాయి విక్రయాలు చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈమెపై తెలంగాణ ఈగల్ బృందాలు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించాయి. నానక్‌రామ్‌గూడలోని ఆమె నివాసంపై దాడి చేసిన అధికారులు గంజాయి కొనుగోలుకు వచ్చిన 47 మందిని అదుపులోకి తీసుకుని రూ.2.60 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
ధూల్‌పేటకు చెందిన కాలాపతి నీతూబాయి (48)పై 2017 నుంచి అనేక ఎన్‌డీపీఎస్ కేసులు నమోదయ్యాయి. గతంలో ఆమె వద్ద కోట్ల రూపాయల ఆస్తులు, భారీ నగదు లభించగా వాటిలో కొన్నింటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఏడాదికిపైగా అజ్ఞాతంలో ఉంటూనే గంజాయి వ్యాపారం కొనసాగిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. తాజా దాడి సమయంలో ముందస్తు సమాచారం అందడంతో ఆమె తప్పించుకోగా, అదుపులోకి తీసుకున్న 47 మందిని పోలీసులు విచారిస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!