

కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా భారతదేశ విజయానికి తమ అసాధారణ ధైర్యసాహసాలతో పోరాడిన వీర సైనికులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘన నివాళులర్పించారు. దుర్భేద్యమైన భూభాగం, తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు భారత సైనికులు దృఢంగా నిలిచారని కొనియాడారు. దేశ రక్షణ కోసం వారు ప్రదర్శించిన ధైర్యం, అంకితభావం ప్రతి భారతీయుడికీ గర్వకారణమని పేర్కొన్నారు.
కార్గిల్ వీరుల మహోన్నత త్యాగం, సాటిలేని పరాక్రమం తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని చంద్రబాబు అన్నారు. వారి సేవలు దేశభక్తికి, జాతీయ గర్వానికి శాశ్వత చిహ్నంగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. 1999 కార్గిల్ యుద్ధంలో దేశ రక్షణ కోసం పోరాడిన భారత సైనికుల ధైర్యసాహసాలను స్మరించుకుంటూ, ప్రాణత్యాగం చేసిన అమర జవాన్లకు నివాళులర్పించే సందర్భంగా కార్గిల్ విజయ్ దివస్‌ను నిర్వహిస్తారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!